Home

వైదిక ధర్మ పరిరక్షణ పరిషత్

శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామివారి దివ్య అనుగ్రహ ఆదేశానుసారము ఒక సంస్థను స్థాపించడమైనది. ఈ సేవా సంస్థ విష్ణుభట్ల హరిదత్త శర్మ అను నేను స్థాపించి వ్వవస్థ స్థాపక అధ్యక్షులుగా వ్యవహరించుచున్నాను. 

ఈ సేవా సంస్థ సర్వ ధర్మములకు మూలము వేదములు, అట్టి వేదములు చెప్పబడిన మార్గమును, వైదిక మార్గము అందురు. అట్టి ధర్మపరిరక్షణ చేయుట వలన దైవానుగ్రహము, కూడా కలుగును. మరియు ధర్మపరిరక్షణ వలన లోకమున శాంతి సౌఖ్యము సౌభాగ్యము కూడా కలుగును. ఇప్పటి కాలమాన పరిస్థితులలో ప్రతివారు ఇంటి వద్ద చేయవలసిన నవగ్రహములు మొదలైన, దేవతా, పూజ, హోమ, అభిషేకాదులు చేసుకొనుటకు సరియైన బ్రాహ్మణులు తగ్గుట ఆర్ధిక బాహుళ్యము పరివారము లేకపోవుట వల్లనూ స్వయముగా ఆచరించుట ఆవకాశం లేని కారణముగా అవి ఆచరించలేక అనేక ఇబ్బందులకు గురి అగుచున్నారు. ఈ సమస్యల పరిష్కారముగా ఆస్తికుల సహకారముతో ఒక సంస్థను స్థాపించి వీలుపడినంత వైదిక ధర్మ పరిరక్షణ చేయు నిమిత్తం ఈ సంస్థ స్థాపించడం జరిగినది.

ఈ సంస్థ యొక్క ఆశయములు:

1) ప్రతినెల నవగ్రహ సాలగ్రామ, శ్రీ చక్ర దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, నవగ్రహ, లక్ష్మీగణపతి, స్వర్ణాకర్షణ, మహాలక్ష్మి సుదర్శన మృత్యుంజయ సప్తశతీ (చండీ ) హోమములు చేయుట.

2) అర్హులైన బాలబాలికలకు పై చదువుల నిమిత్తం ఉపకార వేతనములు ఇచ్చుట.

3) సామూహిక ఉపనయనములు నిర్వహించుట.

4) సంవత్సరమునకు ఒకసారి వైదిక యాగము (సోమయాగము, ఇష్టులు) నిర్వహించుట.

5) సంవత్సరమునకు ఒకసారి లోకకళ్యాణార్థము, శ్రీరుద్ర, చండీయాగం నిర్వహించుట.

6) వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు, కార్తీకమాసం, ధనుర్మాసములలో వేదోక్తములుగా ఉత్సవములు కళ్యాణాలు నిర్వహించుట.

7) పర్వదినములలో పుష్కరాల సమయములో పుణ్యక్షేత్రములలో అన్నదానాదులు నిర్వహించుట.

8) ఆర్ధికముగా వెనుకబడిన అన్నికులాలలోని పేదకుటుంబంలోని కన్య వివాహములకు సహకరించుట.

WHAT WE DO

Scroll to top